మోసపోయిన జీవన చిత్రం
//బుర్రా సాయిబాబు//
ఆకలికి
మెలికలు తిరిగేపేగుల్లా రొడ్డు
అనంతంగా సాగుతోంది
సగంజారిన చూరుకింద చూపులు
ఎంత
ఆశగా
ఎదురుచూస్తాయో అన్నతలపు పేగుల్లోశక్తినింపడమేగాని,
కాళ్ళల్లో ఒపిక
ఉండి
కాదు,
పరిగెత్తడం!
ఇంటినుంచి ఇంత
దూరం
తీసుకొచ్చిన రూపాయి
కాయకష్టం నెర్పిందే కాని,
కాలం
మీద
సందెహం
నేర్పనే లేదు
ఇన్ని
రాళ్ళుమొసిన భుజాలు
దుఃఖం
మోసుకుంటూ
రైలుపట్టాల వెంబడి
ఇంటికి
దారి
పట్టడం
ఓటమో ఎమో
తెలియలెదుగానీ
తెలియని మోసం
ఏదో
వెంబడిస్తున్నట్లు పరిగెత్తడం,
భూమిని
భుజాల
మీద
పెట్టుకున్న హెర్కులస్ లాగా
ఎవరి
శవపేటికని వారేమోసుకు పోవడం
ఒక
దగా
యుద్ధ
తంత్రమే!
పాలబుగ్గల చంటిదాని కళ్ళల్లో మెరుపుకొసం
కాయలుకాసిన పాదాలలొమనసుని దాచి,
ఎర్రటి
ఎండకింద వడి
వడిగా
నడక!
అడపా
దడపా
దొరికే
ఆహారపొట్లాలు
ఇంటికి
చెరుస్తాయొ లెదొగానీ,
ఇంటికి
చేరాకా
మాత్రం
మెతుకులురాలవు అని తెలుసు!
చెమట
నిండిన
కండువాతో నుదిటిరాతని చెరుపుకొవడం తప్ప
చెయ్య గలిగింది కూడాలేదు
Comments
Post a Comment