Skip to main content

Posts

Showing posts from September, 2015
కల నిజమయ్యె రోజు వస్తుంది బుర్రా సాయి బాబు 9291291751 సౌందర్యం ఇంకా స్పష్తం అవలేదు ఇంకా కొన్ని అదృశ్య   కరాళ విష సంస్క్రుతులు తొలగి పొవాల్సి ఉంది , కాల చక్రం తిరగబడుతుందో…. , చరిత్ర పునర్ వ్యవస్థీకరింపబడుతుందో … ఏదయినా కానీ మళ్ళీ తోట పరిమళపు తలుపులు తెరవ బడతాయి   కూలిపొయిన గోడలవెనుకనుండి ఒక సౌందర్య స్వరం వినిస్తుంది   వాడిపొయిన కొమ్మల మధ్య   లయ విన్యాసం మొదలవుతుంది వున్నట్లుండి ఆకాశం విశాలమయి మనసంతా ప్రతిబింబిస్తుంది పగిలిన గాజూపలకల వ్యామొహాలనించి నీటి ఆవిరి మేఘాలుగా   మారి   వాయులీనాలు   నలుదిశలా పరుచుకుంటాయ్ అప్పుడు కాగితం మీది గజిబిజి అక్షరాలు మాయమయి   తెల్లకాగితం కొత్త కవిత్వమయిపొతుంది పొంగి పొంగి   అల్లరి చెసిన నది మధ్యలొ ఒక ఇసుకదిబ్బ పైకి లేచి కొత్త నాగరికతని స్థాపిస్తుంది ! చూస్తూ ఉండగానే ఆ రోజు చివుర్లు చీల్చుకుని వరికంకె అకాశానికి ఒక   స్వేత స్వప్న్నాన్ని బహుమతిగా పంపుతుంది     ...