Skip to main content

Posts

Showing posts from December, 2020
  మోసపోయిన జీవన చిత్రం // బుర్రా సాయిబాబు // ఆకలికి మెలికలు తిరిగేపేగుల్లా రొడ్డు అనంతంగా సాగుతోంది సగంజారిన చూరుకింద చూపులు   ఎంత ఆశగా ఎదురుచూస్తాయో అన్నతలపు పేగుల్లోశక్తినింపడమేగాని , కాళ్ళల్లో ఒపిక ఉండి కాదు ,  పరిగెత్తడం ! ఇంటినుంచి ఇంత దూరం తీసుకొచ్చిన రూపాయి కాయకష్టం నెర్పిందే కాని , కాలం మీద సందెహం నేర్పనే లేదు ఇన్ని రాళ్ళుమొసిన భుజాలు దుఃఖం మోసుకుంటూ రైలుపట్టాల వెంబడి ఇంటికి దారి పట్టడం   ఓటమో ఎమో తెలియలెదుగానీ తెలియని మోసం ఏదో వెంబడిస్తున్నట్లు పరిగెత్తడం , భూమిని భుజాల మీద పెట్టుకున్న హెర్కులస్ లాగా ఎవరి   శవపేటికని వారేమోసుకు   పోవడం ఒక దగా యుద్ధ తంత్రమే !  పాలబుగ్గల చంటిదాని కళ్ళల్లో మెరుపుకొసం కాయలుకాసిన పాదాలలొమనసుని దాచి , ఎర్రటి ఎండకింద వడి   వడిగా నడక ! అడపా దడపా దొరికే   ఆహారపొట్లాలు   ఇంటికి చెరుస్తాయొ లెదొగానీ ,   ఇంటికి చేరాకా మాత్రం మెతుకులురాలవు   అని తెలుసు !  చెమట నిండిన కండువాతో నుది...