Skip to main content

Posts

Showing posts from July, 2016

మధ్యాన్న పద్యం

వీపుమీద మూపురంలా కొన్ని ఆశల్ని మోసుకుంటూ , దారంటా ముడుచుకున్న నక్షత్రాల్ని చూస్తున్నప్పుడు , అనిపిస్తుంది ! ఎలా మొదలైందో ఈప్రయాణం ,                                                    ఆడుగులు కదలవు! ప్రగతి కనిపించదు!! పట్టున పగటి వెలుగు చూసిన దాఖలాలె కనిపించవు రాత్రి నీడను లాగెసుకున్న వైనం మాత్రం తెలుస్తొంది ఎప్పుడుమొదలైందో ఈ ప్రయాణం కక్ష్యలు లేవు లక్ష్యాలు లేవు కాలం నన్ను తాకకుందానె ముందుకు వెడుతోంది తియ్యటి   వాసనేదొ నా నాసికాగ్రాలకి తగలకుండా వెళ్ళిపొవడం తెలుస్తొంది వువ్వెత్తున ఎగసిన బూదిదరంగు పొగలో నా రెణువేదో తెలియడం లెదు నా వునికిని నిర్ధారిస్తూ      కొంచెం వేడి ఇంకా మిగిలి వుంది! బుర్రా సాయి బాబు     ...