మోసపోయిన జీవన చిత్రం // బుర్రా సాయిబాబు // ఆకలికి మెలికలు తిరిగేపేగుల్లా రొడ్డు అనంతంగా సాగుతోంది సగంజారిన చూరుకింద చూపులు ఎంత ఆశగా ఎదురుచూస్తాయో అన్నతలపు పేగుల్లోశక్తినింపడమేగాని , కాళ్ళల్లో ఒపిక ఉండి కాదు , పరిగెత్తడం ! ఇంటినుంచి ఇంత దూరం తీసుకొచ్చిన రూపాయి కాయకష్టం నెర్పిందే కాని , కాలం మీద సందెహం నేర్పనే లేదు ఇన్ని రాళ్ళుమొసిన భుజాలు దుఃఖం మోసుకుంటూ రైలుపట్టాల వెంబడి ఇంటికి దారి పట్టడం ఓటమో ఎమో తెలియలెదుగానీ తెలియని మోసం ఏదో వెంబడిస్తున్నట్లు పరిగెత్తడం , భూమిని భుజాల మీద పెట్టుకున్న హెర్కులస్ లాగా ఎవరి శవపేటికని వారేమోసుకు పోవడం ఒక దగా యుద్ధ తంత్రమే ! పాలబుగ్గల చంటిదాని కళ్ళల్లో మెరుపుకొసం కాయలుకాసిన పాదాలలొమనసుని దాచి , ఎర్రటి ఎండకింద వడి వడిగా నడక ! అడపా దడపా దొరికే ఆహారపొట్లాలు ఇంటికి చెరుస్తాయొ లెదొగానీ , ఇంటికి చేరాకా మాత్రం మెతుకులురాలవు అని తెలుసు ! చెమట నిండిన కండువాతో నుది...
వీపుమీద మూపురంలా కొన్ని ఆశల్ని మోసుకుంటూ , దారంటా ముడుచుకున్న నక్షత్రాల్ని చూస్తున్నప్పుడు , అనిపిస్తుంది ! ఎలా మొదలైందో ఈప్రయాణం , ఆడుగులు కదలవు! ప్రగతి కనిపించదు!! పట్టున పగటి వెలుగు చూసిన దాఖలాలె కనిపించవు రాత్రి నీడను లాగెసుకున్న వైనం మాత్రం తెలుస్తొంది ఎప్పుడుమొదలైందో ఈ ప్రయాణం కక్ష్యలు లేవు లక్ష్యాలు లేవు కాలం నన్ను తాకకుందానె ముందుకు వెడుతోంది తియ్యటి వాసనేదొ నా నాసికాగ్రాలకి తగలకుండా వెళ్ళిపొవడం తెలుస్తొంది వువ్వెత్తున ఎగసిన బూదిదరంగు పొగలో నా రెణువేదో తెలియడం లెదు నా వునికిని నిర్ధారిస్తూ కొంచెం వేడి ఇంకా మిగిలి వుంది! బుర్రా సాయి బాబు ...