Skip to main content

కల నిజమయ్యె రోజు వస్తుంది

బుర్రా సాయి బాబు 9291291751

సౌందర్యం ఇంకా స్పష్తం అవలేదు

ఇంకా కొన్ని అదృశ్య  కరాళ విష సంస్క్రుతులు తొలగి పొవాల్సి ఉంది,

కాల చక్రం తిరగబడుతుందో….,చరిత్ర పునర్ వ్యవస్థీకరింపబడుతుందోఏదయినా కానీ

మళ్ళీ తోట పరిమళపు తలుపులు తెరవ బడతాయి

 కూలిపొయిన గోడలవెనుకనుండి ఒక సౌందర్య స్వరం వినిస్తుంది

 వాడిపొయిన కొమ్మల మధ్య  లయ విన్యాసం మొదలవుతుంది

వున్నట్లుండి ఆకాశం విశాలమయి మనసంతా ప్రతిబింబిస్తుంది

పగిలిన గాజూపలకల వ్యామొహాలనించి నీటి ఆవిరి మేఘాలుగా  మారి 

వాయులీనాలు  నలుదిశలా పరుచుకుంటాయ్

అప్పుడు కాగితం మీది గజిబిజి అక్షరాలు మాయమయి

 తెల్లకాగితం కొత్త కవిత్వమయిపొతుంది

పొంగి పొంగి  అల్లరి చెసిన నది మధ్యలొ

ఒక ఇసుకదిబ్బ పైకి లేచి కొత్త నాగరికతని స్థాపిస్తుంది!

చూస్తూ ఉండగానే రోజు

చివుర్లు చీల్చుకుని వరికంకె అకాశానికి

ఒక  స్వేత స్వప్న్నాన్ని బహుమతిగా పంపుతుంది     

Comments

Popular posts from this blog

నా ఆవేదనే మాధ్యమ౦గా-- బుర్రా సాయిబాబు

నా ఆవేదనే మాధ్యమ౦గా                                                          బుర్రా సాయిబాబు నాన్నా! నీ కలలు కల్పనలు ప్రణాలికలుగా పోగులు పోగులుగా నీ మాటలు చెవిలో గూళ్ళు కదుతూనె ఉన్నాయి నువ్వు నిర్దెసి౦చిన చిత్తరువు పొలిక రాక, నా తూనీగరెక్కలు నిషిద్దాక్షరిలా రాలిపడుతుతున్నాయి  ఎదిగినకొమ్మల్లా కత్తిరిస్తూ పోతె నన్నా నెను మన డ్రాయి౦గ్ రూమ్ లో బోనసాయి వృక్షాన్నయి మిగులుతానేమో?  నాకిప్పుడు చెప్పే వాళ్ళుకాదు కావలసి౦ది, నన్ను క్షుణ్ణ౦గా వినేవాళ్ళు కావాలి భళ్ళున తెరవబడ్డ విస్మయ ప్రప౦చ౦లోకి దూకిన వుడుతును వివరిస్తాను నేను నువ్వు నాలాగే విస్మయ౦చ౦దిన రోజులకి ఇప్పటికి చీకటిరోజుల తెదాఉ౦ది నా వెలుగు గోడమీద ఇప్పటికి వేలసార్లు సూచనలు రాసావు లక్షల నిషేధాజ్నలు రాసావు నన్ను నేను ఫ్రకటి౦చుకునే౦ద...

అద్వైతం - రచన : బుర్రా సాయి బాబు

నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను ! ఒక అదృశ్య పారదర్శక పవన౦లా అనంతంగా నిర౦తర౦గా నా మీదుగా నీ ప్రవాహన్ని అస్వాదిస్తూనే ఉన్నాను! వాక్యాలుగా నేను బహిర్గతమవుతున్నప్పుడు మధ్యలో నా వీపు చరిచి "ఇది నువ్వేనా " అని ప్రశ్ని౦చడ౦! అ౦తలోనే మాయమై నాతో దాగుడుమూతలు ఆడడ౦! అప్పుడే సృష్టి౦పబడ్డట్లు ఉనికి కోస౦ తపిస్తున్నట్లు పాల నవ్వుతో ఒకసారి, అత్యున్నత శిఖరాగ్రాన మెరుపు తళుకుల మధ్య ఒక స్వీయ పరశోధిత నిజాన్ని బహిర్గత పరుస్తూ గ౦భీర వదన౦తో వేరొకసారి, సముద్ర గర్భ౦లో అలల అలజడి లో చిక్కుకుపోయి దిక్కెరుగని నావకు చుక్కాని గా వేరొకసారి. నిన్ను వెతుకుతున్నఫ్ఫుడు నాకళ్ళు నీవి, నా కనురెప్ప వెనుక స్వప్నాల ముద్రలు నీవి, నిన్ను అ౦దుకోలేక కనీస౦ క్షణాల్ని జ్ఞాపికలుగా దాచుకు౦దామని జేబు శుభ్రం చేసుకు౦టాను, నువ్వు నాకు దొరకవు, నీ అక్షరాల స్పర్శ నా క౦టి కి౦ద ప్రవహిస్తూ ఉ౦టు౦ది కళ్ళుమూసి అ౦తర౦గాల్లోకి వీక్షిస్తే ధమనులు, సిరలు కళ్ళుగా నాకోసమె ఎదుచుచూస్తూ ఉ౦టాయని నాకు తెలుసు అక్కడ తప్ప నీ సాదృస రూపంకోస౦ జగమ౦తా జల్లెడ పడుతూ ఉ౦టాను.