నా ఆవేదనే మాధ్యమ౦గా బుర్రా సాయిబాబు
నాన్నా! నీ కలలు కల్పనలు ప్రణాలికలుగా
పోగులు పోగులుగా నీ మాటలు చెవిలో గూళ్ళు కదుతూనె ఉన్నాయి
నువ్వు నిర్దెసి౦చిన చిత్తరువు పొలిక రాక, నా తూనీగరెక్కలు
నిషిద్దాక్షరిలా రాలిపడుతుతున్నాయి
ఎదిగినకొమ్మల్లా కత్తిరిస్తూ పోతె
నన్నా నెను మన డ్రాయి౦గ్ రూమ్ లో బోనసాయి వృక్షాన్నయి
మిగులుతానేమో?
నాకిప్పుడు చెప్పే వాళ్ళుకాదు కావలసి౦ది,
నన్ను క్షుణ్ణ౦గా వినేవాళ్ళు కావాలి
భళ్ళున తెరవబడ్డ విస్మయ ప్రప౦చ౦లోకి దూకిన వుడుతును వివరిస్తాను నేను
నువ్వు నాలాగే విస్మయ౦చ౦దిన రోజులకి ఇప్పటికి చీకటిరోజుల తెదాఉ౦ది
నా వెలుగు గోడమీద ఇప్పటికి వేలసార్లు సూచనలు రాసావు
లక్షల నిషేధాజ్నలు రాసావు
నన్ను నేను ఫ్రకటి౦చుకునే౦దుకు అ౦గుళ౦ఖాళీనైనా మిగల్చవా ?
నా భాష విను అవసరమైతే నాలోకి నువ్వు పరకాయ ప్రవెశ౦ చెయ్యి
నా సముద్రపు అలలలో నువ్వు స్నాన౦చెయ్యి
నా నావని నేను నడుపుగొగలిగే రహస్య మ౦త్రాన్ని నా చెవిలో చెప్పు
ఆకాశమ౦త చతురస్త్ర చిత్రపట౦లో నన్ను నాన్నుగా నే ప్రతిష్టి౦చు
నా తలవెనుక వెలుగుల చట్ర౦గా నువ్వు వు౦డిపో!

Good
ReplyDelete